నీకై నిరీక్షిస్తూ..
నల్లటి దట్టమైన అడవి లాంటి నా ఏకాంతాన్ని భగ్నం చెస్తూ..
భువిని చేరెందుకు చొచ్చుకొని వచ్చె తొలి సంద్యపు సుర్య కిరణాల్లంటి నీ తలపులు..

తామరాకు పై అంటి అంటనట్టుగా జారే నీటి బిందువులా..
నా మేనుని తాకుతూ నను పులకరింపజెసే నీ కురులు..

నువ్వు ఇప్పుడే వచ్చి వెల్లావని చెప్పే..
సుగంధాలు వెదజల్లే నీ మేను..

నువ్వు వస్తున్నావని నను భ్రమింపజేసే
నా మదిలో మ్రోగే నీ కాలి అందియలు..

నాకే తెలియకుండ నిదురలో సైతం నేను కలవరించే నీ పేరు..

నా చేతి గడియారం నిమిషపు ముల్లుతొ..
సరి సమనంగా మీటుతున్న నీ కనురెప్పలు..

ప్రతి విషయంలో(వస్తువులో) నీకై వెతికే..
నా కనులలోని నీ రూపు..

ఇలా అణుక్షణం..
నాలో అణువణువును స్పందింపజేస్తున్న నీపై నా ప్రేమ..
నిను ఓ సారి స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ..
ఏమి తొచక..
స్వాతి చినుకు కోసం వేచే చాతక పక్షి లా..
ఇలా నాలో నేనే నీకై నిరీక్షిస్తున్నా...

0 comments