
ప్రియమైన నా నీకు,
మనసులోని భావాలు భాస్వర స్వరాలై,
నీ పై నా ప్రేమ పరిమళాన్ని వెదజల్లుతూ,
మధురంగా నే రాశానొక ప్రేమలేఖ.
నీ విరహపు బాధ, మన ప్రణయపు గాధ,
నా ఒంటరితనంలో నువ్వు నింపిన ఆశ,
మౌనంగా వచ్చి, మాటలతో మత్తెక్కించి,
ఆశగా కవ్వించి, ముద్దులతో మురిపించి,
మనసునే మైమరపించావు.
ఒంటరితనంలో ఆశలు రేపి,
నా జీవితానికే శ్వాసను నింపి నిశ్శబ్దం గా మాయమయ్యావు.
నీ రాకకోసం చక్రవాక పక్షిలా ఎదురుచూస్తున్నా!!!
నీకొరకే అన్వేషిస్తున్నా!!!
నీవులేని నా జీవితం శూన్యానికే అంకితం..........
ఇట్లు,
నీ నేను.
0 comments
Post a Comment